హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన వివాదాస్పదమైన వేళ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన సతీమణి ఉపాసన. రామ్‌చరణ్ ఎప్పుడూ తన మతాన్ని గౌరవిస్తూనే ఇతర మతాలనూ అంతే గౌరవంగా చూస్తారని రాసుకొచ్చారు. నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ అందర్ని కలిపే ఉంచుతాయని తెలిపారు. భారతీయుల బలమే ఐకమత్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఉపాసన.
ఇదే సమయంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు ఉపాసన. శబరిమల అయ్యప్ప సన్నిధిలోనూ వావర్ స్వామి అనే ఇస్లాం భక్తుడి సమాధి ఉందని.. అయ్యప్ప భక్తులు దాదాపుగా అందరూ ఆ దర్గాను సందర్శిస్తుంటారని ట్వీట్‌లో ఉంది. దీనిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అయ్యప్పకు, వావర్ స్వామికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.