స్వతంత్ర, వెబ్ డెస్క్: మోడి మంత్రి వర్గంలో త్వరలో మార్పులు చేర్పులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నారు. మహరాష్ట్ర సీఎం షిండే వర్గానికి రెండు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం. అలాగే.. కొందరు మంత్రులను తప్పించి..కొత్త వారికి చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను మంత్రి వర్గం నుంచి తప్పించి పార్టీ బాద్యతలు ఇవ్వనున్నారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండగా.. ఈ రాష్ట్రాలకు మంత్రి వర్గంలో చోటు లభించనుంది.
తెలంగాణకు మంత్రి వర్గంలో కూడా మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి వేరొక పదవి ఇచ్చి..కేంద్ర మంత్రి స్థానాన్ని మరోకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కెనా? అనే మాటలు వినిపిస్తున్నాయి.ఒకవేళ బండికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి..ఈటలకు పార్టీ భాద్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయని పలువులు భావిస్తున్నారు. అయితే కొందరు సీనియర్లు మాత్రం ఈటలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటున్నారు. ఇదే నిజమైతే బండికి కేంద్రంలో పదవి ఖాయం.