స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ భారీ భహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి భారీగా ఆదీవాసీలు తరలి వచ్చారు. ఎంపీ సోయం మాట్లాడుతూ.. జిల్లాలో మతమార్పిడులకు 12 మంది పాస్టర్లు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు 1200 మంది అమాయక ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. జ్వరంతో బాధపడే గిరిజనులకు మంచినీటిలో పారాసిటిమాల్ మాత్రను కలిపు యేసు లీలగా నమ్మిస్తున్నారని మండిపడ్డారు. నాడు 1965లో వలస లంబాడలతో నష్టపోయామని.. నేడు మత మార్పిడులు అంతకన్నా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని అన్నారు. మతమార్పిడుల నిరోధానికి ప్రత్యేక బిల్లు తీసుకు వస్తామని సోయం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర కిణ్వట్, పంద్రాకవాడ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.