బీఆర్ఎస్ పార్టీ పేరును టిఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. ఈ అంశంపై ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పేరు మార్చాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చడంతో తెలంగాణ అనే సెంటిమెంట్ కు దూరం అయ్యామనే భావనలో బీఆర్ఎస్ ఉంది. పార్టీ పేరు మార్చాలని పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లోనే కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27 వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ పేరు మార్పుపై ఆర్ఎస్ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


