ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రదేశంలో నమస్కరించారు. పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనం తరం సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల పరిశీలనకు చంద్రబాబు వెళ్లారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. పర్యటన అనంతరం మీడియా తో ఆయన మాట్లాడారు.


