స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. వర్చువల్ గా ఏసిబి కోర్టులో అధికారులు బాబును ప్రవేశపెట్టనుండగా…. న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అటు రిమాండ్ పొడిగించాలని సిఐడి కోర్టును కోరే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు, మూడు చోట్ల పర్యటనలు ఉండేలా టీడీపీ ప్లాన్ సిద్ధం చేసింది. ఇక చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్నితిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.