23.2 C
Hyderabad
Friday, January 10, 2025
spot_img

తొక్కిసలాట బాధితులను పరామర్శించిన చంద్రబాబు

తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. 35 మంది భక్తులు దాదాపు స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు చంద్రబాబు నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యరు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని నిలదీశారు. బాధ్యత తీసుకున్నవారు సరిగా నెరవేర్చాలి కదా అని మండిపడ్డారు. 2వేల మందే పడతారని అనుకున్నప్పుడు.. 2500 మందిని ఎందుకు లోపలికి పంపించారని ప్రశ్నించారు. ఎక్కువమంది ఉన్నప్పుడు గేటు తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా..? అని అన్నారు. పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని అధికారులు సీఎంకు వివరించారు. బయటకు వదిలినప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు.

Latest Articles

ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు

దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్