31.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలి- భూమన కరుణాకర్‌ రెడ్డి

తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసుల్ని, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలను సస్పెండ్ చేయాలని కోరారు. సనాతన ధర్మం పరిరక్షిస్తానని చెప్పిన పవనానందం స్వామి వారు మాట్లాడాలని సెటైర్లు వేశారు. సనాతన ధర్మం కాపాడుతానని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోతే , రోడ్డు బాగలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. దేవుడితో పెట్టుకుంటే ఆయన చూస్తాడు అంటూ చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు ఆడితే స్వామి చూస్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవాదులు రావడాన్ని రాజకీయ పావుగా వాడుకుంటున్నారు. అందుకే ఈ ఘోరాలు జరుగుతున్నాయి.

తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు ఎవరూ కాపాడలేరు. జగన్ మోహన్ రెడ్డిపై ఏడుపే తప్ప, పాలన లేదు. టిటిడి ఈవోని, ఎస్పీని బదిలీ చేయాలి. చనిపోయిన బాధితులకు రూ. కోటి, బాధితులకు రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం.

టిటిడి నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. క్యూలైన్‌ పర్యవేక్షణ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిది కాబట్టి ఆయనను అరెస్టు చేయాలి. టిటిడి ఈవో స్థాయి నుంచి ఎస్పీ అందరిపైనా వేటు వేయాలి.

గత ప్రభుత్వం హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించాం. తిరుమల దేవస్థానాన్ని రాజకీయ క్రీడా మైదానంగా మార్చారు. మీరు చేస్తున్న తప్పులకు భక్తులు కష్టాలు పడుతున్నారు. టిటిడి చైర్మన్‌ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరికి చంద్రబాబు సేవ తప్పా, భక్తులను పట్టించుకోవడం లేదు.

బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. భక్తులు సేవకు 15 మంది పోలీసులు లేరు. సిఎం చంద్రబాబు వస్తున్నాడు అంటే 2వేలకు పైగా పోలీసులు మోహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. తమిళనాడు శ్రీరంగంలో పదిరోజులు దర్శనం తరహాలో తిరుమలలో అమలు చేశాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం, వాటిని మార్చలేరు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్