ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు ముక్కలాటతో ఏ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచపటంలో పెట్టే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుందన్నారు. ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని, మరోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారు అని చంద్రబాబు చెప్పారు. అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారని చంద్రబాబు తెలిపారు.