Minister Ambati | సత్తెనపల్లిలో చంద్రబాబు చేసింది అట్టర్‌ఫ్లాప్ షో అని ఏపీ మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. సత్తెనపల్లిలో జనం రాకపోయినా మహాద్భుతం అని బాబు అంటున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చి ఏమీ ఉపయోగం లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు పేదల్ని ధనవంతుల్ని చేశారా? అని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలన్న ఒక్క అజెండా మీదనే చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడని చంద్రబాబు.. అవసరం అయితే ఎవరినైనా తిడతారు లేదా పొగడతారని అన్నారు. కాగా, ఇటీవల గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే.