పెన్షన్ టెన్షన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పెన్షన్ అంశానికి సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహాన్ని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. దీంతో ఆయన వెంటనే అప్రమత్తమ య్యారు. అవ్వా తాతయ్యలకు పెన్షన్ అందకపోవడానికి కారణం తాను కాదంటూ వివరణ ఇచ్చారు. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు. అవ్వాతాత అంటూనే వృద్ధులను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు చంద్రబాబు నాయుడు.
పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ ఖజానాలో సొమ్ములు లేకపోవడమేనని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బు ను జగన్మోహన్ రెడ్డి తన స్వంత కాంట్రాక్టర్లకు ఇచ్చేశారన్నారు. అయితే ఆ విషయాన్ని బయటపెట్టకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటు ఆరోపణలు చేశారు చంద్రబాబు. పెన్షనర్లకు సకాలంలో సొమ్ము అందకపోవడానికి కారణం నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డేనని చంద్రబాబు నాయుడు ఆరోపిం చారు. చివరకు ఎన్నికల్లో లబ్ది కోసం ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్నికల కమిషన్‌పై వేస్తు న్నారని జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా సొమ్ములు ఇవ్వలేదని విమర్శించారు. దీనికం తటికీ కారణం పెన్షన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్‌కు లేకపోవడమేనని విమర్శించారు చంద్రబాబు నాయుడు. తన రాజకీయ లబ్ది కోసం వృద్దులను, వికలాంగులను నడివేసవిలో రోడ్డుపైన జగన్మోహన్ రెడ్డి నుంచోపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెన్షన్ …టెన్షన్‌గా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. పెన్షన్ వివాదానికి సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలుగు దేశం పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, తహశీల్దార్లను కోరాలని పార్టీ నాయకులను ఆదేశించారు చంద్రబాబు. వలంటీర్ల విషయంలో తెలుగు దేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు టీడీపీ కార్యకర్తలు వివరిం చాల న్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీనీడలో పావులు కాకుండా వలంటీర్లను కాపాడాలన్నారు చంద్ర బాబు నాయుడు. మరోవైపు పెన్షన్ దుమారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివా లయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఆదేశించారు. గతంలో వలంటీర్లు ఇచ్చిన విధంగానే నేరుగా లబ్దిదారులకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.


