32.7 C
Hyderabad
Friday, February 7, 2025
spot_img

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్…అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్…ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే మార్గాలు బోధించి.. ఆ గొలెట్టే వ్యక్తుల వేదన తీరుస్తాం. అయితే, శుభ్రంగా, అందంగా ఉండే సౌమ్యుడనైన సోముడికే ఈ సమస్య వస్తే…జాబిల్లి మామ చందమామకే ఈ విపత్కర పరిస్థితి తలెత్తితే…స్వచ్ఛ మాటలు, సత్యమాటలు చెప్పేదెవరు..? ఆ చెత్తను తొలగించేదెవరు..? ఇదేం చోద్యం..నిక్షేపంలాటి చంద్రుడిపై చెత్త, చెదారం అంటూ చెత్త చెత్త మాటలతో చంద్రుడి పరువు తీయాలని చూస్తున్నారా..? ఇప్పటికే పాపం చంద్రుడు ఎన్నో శాపాలకు గురై.. అమావాస్య క్షీణతలు, గ్రహణాల బాధలతో సతమతం అవుతుంటే అందాల చంద్రునిపై ఈ ప్రేలాపనలు ఏమిటి అంటున్నారా..? ప్రమాదం అంచున ఉన్న వారసత్వ ప్రదేశాల లిస్ట్ లో చంద్రయ్య ఉన్నాడని డబ్ల్యూఎంఎఫ్ తాజా రిపోర్ట్ లో వెల్లడించింది. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ తాజాగా విడుదల చేసిన ‘ప్రమాదంలో ఉన్న సంస్కృతిక వారసత్వ స్థలాల జాబితా-2025 లో అందాల చందమామను చేర్చేసింది.

ఎన్నో రీతుల్లో ఎన్నో దేశాల శాస్త్రవేత్తల ప్రయోగాలతో ర్యాకెట్లు, జట్లు, సైంటిఫిక్ కిట్లు, స్పేస్‌పోర్ట్, కాస్మోడ్రోమ్, ఉపగ్రహాలు… గ్రహాల మీదకు వెళ్లిపోతున్నాయి కదా..! ఇక చల్లగా, చక్కగా ఉండే చందమామ మీద ప్రయోగాలంటే ఏ శాస్త్రవేత్తకైనా, ఏ దేశ స్పేస్ సెంటర్ కైనా ఇంట్రస్టే ఉంటుంది కదా..! ఈ ఇంట్రస్ట్ బాగానే ఉంది కాని…శుభ్రతా, పరిశుభ్రతలపై ఎవరైనా, ఎక్కడైనా దృష్టి పెట్టాలికదా అని డబ్ల్యూఎంఎఫ్ అంటోంది. చంద్రుడిపై మానవ కార్యకలాపాలు బాగా పెరిగిపోవడమే ఈ ముప్పునకు కారణమని వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ తెలియజేస్తోంది.

చల్లని మామ చందమామపై పరిశోధనలకు వెళ్లిన మనుషులు, మర మనుషులు అక్కడ తమ దినచర్యలు సాగించాలిగా మరి. కాలకృత్యాలకు సంబంధించిన వస్తువులో, కాస్మటిక్ కు చెందిన వస్తువులో, మరో వస్తువులో ఏమో కాని…పలు రకాల వస్తువులు జాబిలి ఉపరితలంపై ఉండిపోయాయని డబ్ల్యూఎంఎఫ్ పేర్కొంది. కొత్త పుంతలు తొక్కుతున్న అంతరిక్ష పర్యాటకంపైనా వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ వేదన చెందుతోంది. దీంతో, చంద్రుడికి సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పడిపోవచ్చని అంటోంది.

చంద్రమండలం మీద లక్షల కిలోల చెత్త పేరుకుపోయిందనే వార్తలు గతంలోనే వచ్చాయి. బద్దలైన ఎన్నో అంతరిక్ష నౌకలు చంద్రమండలం మీద చెల్లాచెదురుగా పడివున్నాయనే మాటలు వచ్చాయి. అయితే, స్వచ్ఛ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నా ఇళ్లలో, వీధుల్లో చెత్త గురించి సైతం అంతంత మాత్రమే ఆలోచనలు సాగించే వేగవంత సమాజంలో ఎక్కడో చంద్రుడిపై చెత్త గురించి ఏం ఆలోచిస్తారు. కొందరు పర్యాటక ప్రేమికులు గొంతెత్తి చించుకుంటున్నారు మరికొందరు మూగవేదన పడుతున్నారు. అంతరిక్షంలో చెత్తకు సంబంధించిన లెక్కలు చూస్తే…రెండు లక్షల కిలోల చెత్తలో 70 అంతరిక్ష నౌకల ముక్కలు, 14 వేల పాత రాకెట్ భాగాలు, వ్యోమగాములు కాలకృత్యాలకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ బ్యాగ్స్…వగైరా వగైరా చెత్త ఎంతో అంతరిక్షంలో పేరుకుపోయినట్టు తెలుస్తోంది.

చంద్రశేఖరుడి శిరస్సుపై ఉండే చంద్రుడి సొంత సామ్రాజ్యంలో… చంద్రుడి ఉపరితలంపై మానవ కార్యకలాపాలు ఉన్న దాదాపు వందకు పైగా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, వెంటనే ఈ విషయంపై దృష్టి సారించకపోతే.. క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, స్వచ్ఛ చంద్ర కార్యక్రమాలు చేపట్టపోతే…చంద్రాగ్రహానికి గురికాక తప్పదని తెలుస్తోంది. వైరల్ వీడియాలు, సోషల్ మీడియాలకు ఈ వార్తలు చేరిపోతే…చంద్రయ్య మీద చెత్తపై ఇంకెన్ని పోస్ట్ లు, హేట్ లు వచ్చేస్తాయో మరి.

Latest Articles

విజయసాయిరెడ్డి వర్సెస్‌ వైసీపీ

పార్టీ నుంచి వెళ్లి పోతున్న వైసీపీ నాయకులపై , మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. తనలో ఎలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్