స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. దీంతో కేంద్రం తన తరపు వాదనలను సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇలాంటి వివాహాలను గుర్తించడం వల్ల ఎంతో పవిత్రమైన భారతీయ వివాహా వ్యవస్థకు తూట్లు పడతాయని తెలిపింది. దేశంలో ఏ మతం, ఏ కులమైనా స్వలింగ వివాహాలను ఒప్పుకోవడం లేదని పేర్కొంది. కనుక ఇలాంటి వాటికి చట్టబద్ధత కల్పించవద్దని కోరింది.


