న్యూఢిల్లీ: టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సహకారంతో కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) బుధవారం న్యూఢిల్లీలో ఐదో ఎడిషన్ ‘లైన్‌మ్యాన్ దివాస్’ను ఘనంగా నిర్వహించింది. భారతదేశ విద్యుత్ రంగానికి వెన్నెముక అయిన లైన్‌మ్యాన్, గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బందిని సత్కరించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశం అంతటా 45కి పైగా రాష్ట్ర, ప్రైవేట్ విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి, ప్రసార సంస్థల నుండి 180 మందికి పైగా లైన్‌మెన్‌లు నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్వహించడంలో అనుభవాలు, సవాళ్లు, కీలక క్షణాలను పంచుకోవడానికి కలిసి వచ్చారు. ఉత్తమ భద్రతా పద్ధతులను ఈ కార్యక్రమంలో కీలకంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ తన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. “అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలు, శక్తివంతమైన సమాజానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కనిపించని హీరోలు లైన్‌మెన్‌లు. విపత్తులు వచ్చినా, ప్రతికూల వాతావరణం ఉన్నా.. ఎలాంటి సవాలును అయినా అధిగమించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడానికి అవిశ్రాంతంగా వీరు కృషి చేస్తారు. మార్చి 4న లైన్‌మన్ దివాస్ వారి అచంచలమైన అంకితభావాన్ని వేడుక జరుపుకుంటుంది. ఇంధన రంగంలో భద్రత, సహకారం, ఆవిష్కరణలను పెంపొందిస్తుంది. ముఖ్యంగా జాతీయ భద్రతా వారంలో భాగంగా వారి కీలక పాత్రను గుర్తించి, గౌరవించడానికి అంకితమైన రోజుగా దీనిని నిర్వహించటం , వారి భద్రత, శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది” అని తెలిపారు.