ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తామని సీఎం కేసీఆర్(KCr) సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపారని అన్నారు. ఇందువల్లే ప్రైవేటీకరణను వెంటనే తాత్కాలికంగా నిలిపేస్తున్నామనే ప్రకటన వచ్చిందన్నారు. ఏపీలో బీఆర్ఎస్ తొలివిజయం సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ తెగించి కొట్లాడింది కాబట్టే.. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అట్లుంటదని స్పష్టం చేశారు.
Read Also: ‘చాట్ స్క్రీన్ షాట్స్’ పై స్పందించిన కవిత
Follow us on: Youtube, Koo, Google News