28.9 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

గనుల వేలానికి సిద్దమైన కేంద్రం…. ప్రైవేటు పరం చేయొద్దంటున్న రేవంత్ ప్రభుత్వం

తెలంగాణ రాజకీయాల్లో గనుల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బొగ్గుల వేలంపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ పొలిటికల్‌ వార్‌ ముదురుతుండగా మరోవైపు సున్నపు గనుల వేలానికి డెడ్‌లైన్‌తో కూడిన లేఖ రాస్తూ ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్‌ను పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోదీ సర్కార్‌ నోటిఫై చేసింది.అందులోని ఆరింటిని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే, ఈ ఖనిజాలను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణలో బొగ్గు కాకుండా మరో 11 సున్నపురాయి గనులపై కన్నేసింది కేంద్రం. ఈ మేరకే వీలైనంత త్వరగా వేలం వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సున్నపురాయి, ఇనుము, క్వార్ట్జ్‌ వంటి ఖనిజాల గనులను వేలంలో ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి బదులు ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించా లని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

  బొగ్గు కాకుండా తెలంగాణలో మరో 11 చోట్ల సున్నపు నిక్షేపాలున్నాయి. అవి సూర్యాపేట జిల్లాలోని సైదులనామా, సుల్తాన్‌పూర్, పుసుపులబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండ, ఆదిలాబాద్‌ జిల్లాలోని కంపజునపాని తదితర ప్రాంతాల్లో ఈ సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో 2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ లేఖలో కోరింది. వీటిలో కనీసం ఆరు గనులనైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు, ఖనిజాల అభివృద్ధి-నియంత్రణ చట్టంలోని సెక్షన్‌-10 బీ, 11 ప్రకారం తామే వేలం వేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్‌ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గరపడటంతో రేవంత్‌ సర్కార్‌ గనుల వేలం, కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే సింగరేణికి దక్కాల్సిన సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు గనులను వేలంలో ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్న నేపథ్యంలో ఇతర గనులను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది

  రాష్ట్రంలోని మూడు సున్నపురాయి గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసుపుల బోడు, సైదులనామా, సుల్తాన్‌పూర్‌ సున్నపురాయి గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబరు 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబరు 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియను కొనసాగించాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏయే దశల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలనూ ఆరా తీసింది. ఈ సమాచారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది. ఈ క్రమంలోనే సున్నపురాయి గనుల వేలంపై కూడా ఫోకస్‌ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్‌లైన్‌ దగ్గరపడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్‌ పరంకాకుండా ఉండేందుకు పన్నాగాలు పన్నుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణా మాలు చోటు చేసుకోనున్నాయి..? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? కేంద్రాన్ని అడ్డు కోగలదా అన్న అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్