Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు

    రాజకీయ రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ జాబితా చాలా పెద్దది. ఇందులో ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రన్నాయుడు. 2012 నవంబర్‌లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు చనిపోయారు. ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్ కి ఢీకొంది. దీంతో ఎర్రన్నాయుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత ఎర్రన్నాయుడు చనిపోయారు.

   2013లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ లాల్‌ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2013లో హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళుతుండగా లాల్‌ జాన్ బాషా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లాల్‌ జాన్ బాషా అక్కడికక్కడే చనిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన లాల్‌ జాన్ బాషా తెలుగుదేశం పార్టీలో అగ్ర నాయకుడిగా కొనసాగారు. గుంటూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఒకదశలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2013 ఆగస్టులో నందమూరి హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరవడానికి నెల్లూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణయే స్వయంగా కారు నడుపుతున్నారు. నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం ఫలితంగా హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హరికృష్ణను హుటాహుటిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మృతిచెందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావంలో నందమూరి హరికృష్ణ కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ ప్రయాణించిన చైతన్యరథానికి సారథిగా వ్యవహరించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు.

     2014లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రముఖ రాజకీయవేత్త శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదం కారణంగా చనిపో యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతంలో భూమా వర్గానికి రాజకీయంగా మంచి పట్టుంది. భర్త నాగిరెడ్డి రాజకీయాలకు శోభ చేదోడువాదోడుగా ఉండేవారు. శోభా నాగిరెడ్డికి రాష్ట్రస్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉంది. భవిష్యత్తులో శోభా నాగరెడ్డి రాజకీయంగా రాష్ట్ర స్థాయి నాయకురాలు అవుతారన్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆమెను బలిగొంది. తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖుడు పటోళ్ల ఇంద్రారెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2000 ఏప్రిల్ 22న ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలోని పాల్మకూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

పటోళ్ల ఇంద్రారెడ్డి తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. కౌకుంట్ల గ్రామ సర్పంచ్‌గా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1985లో తెలుగుదేశం పార్టీ తరపున చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో విద్యా, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి పనిచేశారు. ఆ తరువాత 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఎన్టీ రామారావు క్యాబినెట్‌లో హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి పనిచేశారు. వీరే కాదు..పలువురు ప్రముఖుల పిల్లలు కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.2003 అక్టోబరులో సినీ నటుడు బాబూ మోహన్ కుమారుడు పవన్‌ కుమార్ రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఆ తరువాత మరో సినీ ప్రముఖుడు కోట శ్రీనివాస రావు కుమారుడు కూడా రోడ్ యాక్సిడెంట్‌లో చనిపో యారు. కోట శ్రీనివాస రావు కుమారుడు కోట ప్రసాద్ స్పోర్ట్స్ బైక్‌పై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

    మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా రోడ్డు ప్రమాదంలో పెద్దకొడుకును కోల్పోయాడు. 2011 సెప్టెంబర్లో అయాజుద్దీన్ అవుటర్ రింగ్ రోడ్డుపై బైక్‌పై వెళుతుండగా యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే అయాజుద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. 2011 డిసెంబర్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నార్సింగ్ – పటాన్ చెరువు మధ్య కొల్లూరు సమీపాన ఈ ప్రమాదం జరిగింది. కాగా నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరాం కూడా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 2014 లో నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉంటే, 2017 మే నెలలో రాజకీయ ప్రముఖుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ కుమా రుడు నిషిత్‌ ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు ప్రమాదమే దీనికి కారణం. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ కూడా రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. 2017 జూన్‌లో అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్