అవినీతి ఆరోపణల కేసులో CCS ACP ఉమామహేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఉమా మహేశ్వరరావును నిన్న అరెస్టు చేశారు.నిన్న ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఉమామహేశ్వరరావు నివాసం సహా 14 చోట్ల తనిఖీలు చేసింది. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను గుర్తించారు. శామీర్పేట్లో ఒక విల్లా, ఘట్కేసర్లో 5 ప్లాట్లను గుర్తిం చింది ఏసీబీ. 38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని అంటున్నారు. ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.


