Viveka Murder Case | హైదరాబాద్: నేడు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మాజీ మంత్రి వివేకా హత్యకేసు విచారణలో భాగంగా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా అవినాష్ రెడ్డిని విచారించారు సీబీఐ అధికారులు. నేడు కూడా అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ వివేకా హత్యకు గురైన రోజున.. జరిగిన పరిణామాలపై సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో నేడు సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీత. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోనీ ధర్మాసనం ఈ కేసు విచారణ జరపనుంది. విచారణ అనంతరం వచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.