YS Viveka murder case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఆదివారం వైఎస్. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో కూడా అవినాష్ ను సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి నిన్న నోటీసులు పంపగా.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు అయ్యేందుకు ఈరోజు ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు.