హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా మాధవీలత వ్యవహరించాంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన యాత్రలో పాల్గొన్న మాధవీలత… ఆ యాత్ర సిద్ధి అంబర్ బజార్ సర్కిల్‌కు చేరుకోగానే.. అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కు పెట్టినట్లుగా పోజు ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవీలత చర్యలపై మండిపడ్డారు.


