వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి తోమాల సేవ పేరుతో సిఫార్సు లేఖల అమ్మకంపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవ సిఫార్సు లేఖల కోసం మూడు లక్షల రూపాయలు వసూలు చేశారంటూ చిట్టిబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుంటూరులోని అరండల్‌పేట పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేశారు. అలాగే భరత్ పీఆర్వో మల్లికార్జునపైనా కూడా కేసు నమోదైంది.
అయితే ఈ కేసుపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజా టికెట్లు అమ్ముకునేంత దౌర్బాగ్యం తనకు పట్టలేదన్నారు. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశాననే కక్షతో తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని..వాటిని కచ్చితంగా ఎదుర్కొంటానని భరత్ చెప్పుకొచ్చారు.