స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా విజయవాడ – మచిలీపట్నం హైవే కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు సైకిలిస్టును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చాట్లవానిపురానికి చెందిన తొమండ్రు ఆశీర్వాదం (50) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయారు. పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.