తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హన్మకొండ 4వ ఎంఎం కోర్టులో స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. పోలీసులు విచారణకు బండి సంజయ్ సహకరించడం లేదని తెలిపారు. సంజయ్ బెయిల్ రద్దు, A6, A9 బెయిల్ పిటిషన్లపై రేపు నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. కాగా హిందీ పేపర్ మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.