17.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏం జరిగిందో తేల్చేస్తారా ?

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మళ్లీ కదలిక వస్తోందా అంటే అవుననే మాట విన్పిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి పరిశీలించారు. శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రాజెక్టులో నెలకొన్న సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చారు.

వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును కేంద్రం సహకారంతో తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తామంటూ ఇటీవలె చెప్పుకొ చ్చారు ఏపీ సీఎం చంద్ర బాబు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు పోలవరం వెళ్లిన చంద్రబాబు. ప్రాజెక్టులో ఎక్కడ ఏం జరిగిందన్నది ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి సారించారు.

పోలవరం ప్రాజెక్టులో సాంకేతికంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేసింది. అంతర్జాతీయంగా పేరుపొందిన జలవనరుల నిపుణులను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జా తీయ నిపుణులు రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డీసిస్కో, సీన్, డేవిడ్‌ బి. పాల్‌తో కూడిన నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిం చింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, గ్యాప్-1, డయాఫ్రం వాల్ నిర్మాణాలను పరిశీలించింది. మొదటగా ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి వచ్చిన నిపుణులు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జ్ సీఈ, ప్రస్తుత ఎస్‌ఈతో భేటీ అయ్యి పోలవరంలో ప్రస్తుతం ఎంతవరకు పనులు జరిగాయి.ఇంకా ఎంత మేర పనులు మిగిలి ఉన్నాయి. అనే వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా స్పిల్‌వేకు చేరుకొని ప్రాజక్టు మ్యాప్ పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం చేరుకొని అక్కడ జరిగిన పనులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలు, సాంకేతిక వివరాలను సీడబ్ల్యూసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇక, ఎగువ కాపర్ డ్యాంపే మూడు చోట్ల జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ తీసిన మట్టి నమూనాలను నిపుణుల బృందం పరిశీలించింది. దిగువ కాపర్ డ్యాం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలు, సాంకేతిక వివరాలను పరిశీలించింది.పోలవరం పర్యటనలో భాగంగా తాము గమనించిన సాంకేతిక అంశాలను అన్నీ క్రోడీకరించి ఓ రిపోర్ట్ తయారు చేయనుంది ఈ అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం. ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించి ఏ విధంగా సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది వివరించనుంది నిపుణుల బృందం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా సీరియస్‌గా దృష్టిసారించింది ఏపీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఇప్పటి కే 31 సార్లు సందర్శించానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వందసార్లు ప్రాజెక్టు పనులను సమీక్షిం చానని ఇటీవలె చెప్పుకొచ్చారాయన. కానీ, ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే అందరికంటే తానే ఎక్కువ బాధప డుతున్నానని తెలిపారు ముఖ్యమంత్రి. మారిన పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలియదని చెప్పిన ఆయన నిర్మాణానికి సైతం నాలుగేళ్లు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు.

ఈ సందర్బంగానే వైసీపీ పాలనలో జరిగిన పనులను ప్రధానంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్‌ తో వేల కోట్లు అదనపు ఖర్చు భారంగా పడడంతోపాటు సమయం వృథా అయింద న్నారు. పనులను నిలిపివేయడంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల ధ్వంసమైన విషయాన్ని వెల్లడిం చారు. కొత్త వాల్ నిర్మించాలంటే 990 కోట్ల మేర ఖర్చవుతుందని చెప్పిన ఆయన.. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు భవిష్యత్‌తో ఆటలాడుకుందని విమర్శించారు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు చంద్రబాబు.ఇలా ఒకదాని వెంట మరోటిగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పోలవరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం సైతం విడుదల చేసింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో పోలవరం విషయంలో చకచకా పనులు జరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్