Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కవితకు బెయిల్ లభించేనా !

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా.. లేకుంటే జైలులోనే కొనసా గుతారా. అన్నది కోటి డాలర్ల ప్రశ్న. ఢిల్లీ మద్యం విధానం కేసులో 2003 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన ఈడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను మార్చి 22న అరెస్ట్ చేసింది. దీంతో మద్యం కేసులో నిందితులకు ఉచ్చు బిగిస్తోందని ప్రచారం జరుగుతోంది.

   2022 లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని అడపా దడపా అరెస్ట్ చేస్తూ వచ్చారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర వహించారని.. సౌత్ బ్లాక్ లో ఆమె సమన్వయకర్త అని ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఆమె శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. రిమాండ్ పూర్తి కావడంతో నేడు ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరు పరచగా, ఏప్రిల్ 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది . మరోవైపు మధ్యంతర బెయిల్ పై ఏప్రిల్ 1న విచారణ జరుగనుంది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు.

   మార్చి 15న అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు ఆమెను హాజరుపర్చారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు అపీలు చేశారు.కాగా, కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.

 కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరుపు న్యాయవాది వాదించారు. కాగా, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కవితతో పాటు పలు వురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ పేర్కొంది వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయ వాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలి పింది.కోర్టు హాలులోకి తీసుకెళ్తుండగా కవిత ఆ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తనను తాత్కాలి కంగా జైలుకు పంపొచ్చని, కానీ, కడిగిన ముత్యంలా బయటకొస్తానని అన్నారు. ఇది తప్పుడు కేసు అనీ, తాను ఏ తప్పు చేయలేదని ధీమాగా చెప్పారు. తాను అప్రూవర్ గా మారే ప్రసక్తి లేదన్నారు. తనను తాత్కా లికంగా జైల్లో పెట్టొచ్చు.. కాని, తన ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బ తీయలేయ లేరని అన్నారు.. క్లీన్ గా బయటకు వస్తా అని ధైర్యంగా చెప్పారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఓ నిందితుడు ఇప్పటికే బిజెపిలో చేరాడని, మరో నింది తుడు బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిజెపి 50కోట్లు ఇచ్చాడని కవిత ఆరోపించారు.

2021-22లో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారుల లాబీ సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అందాయని గతంలో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి . ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట తదితరులు ఉన్నారు. సౌత్ గ్రూప్ తరఫున పిళ్లై, అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2023 సెప్టెంబర్ లో కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలిసారి ఈడీ సమన్లు జారీచేసింది. ఆ తర్వాత మరి కొన్ని సార్లు సమన్లు జారీ అయినా సమన్లను సవాల్ చేస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కోర్టులో కేసు విచారణలో ఉంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్