29.7 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

లోక్ సభ స్థానాల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ వ్యూహాలు

   బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది. ఇక ఎన్నికల ప్రచారంపై బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఫోకస్ పెట్టనున్నారు. కేసిఆర్ బస్సు యాత్రలు కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలతో ప్రచారం సాగుతుంది. లోక్ సభ ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేసేందుకు బిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. 2019 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహం సిద్ధమైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం నుండి లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుండి మాలోత్ కవిత, వరంగల్ నుంచి కడియం కావ్య,పెద్దపల్లి స్థానంలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ స్థానంలో మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుండి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మెదక్ నుండి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ నుండి గాలి అనిల్ కుమార్, చేవెళ్ల స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజిగిరి నుండి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ స్థానంలో పద్మారావు గౌడ్, ఆదిలాబాద్ నుండి ఆత్రం సక్కు,నిజామాబాద్ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్,హైదరాబాద్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నల్గొండ స్థానంలో కంచర్ల క్రిష్ణా రెడ్డి, భువనగిరి నుండి క్యామ మల్లేష్ ను
ఖరారు చేశారు.

బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లో మూడు ఎస్సీ ,రెండు ఎస్టీ రిజర్వ్ద్ స్థానాలు పోగా మిగిలిన నియోజకవర్గాల్లో ఆరు స్థానాలను ఓసీలకు, ఆరు స్థానాలను బీసీలకు కేటాయించారు. ఈ సారి లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించామని పార్టీ చెబుతోంది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో వుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం గులాబీ పార్టీకి కీలకంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ ను అధిగమించే స్థితి లో ఉంది. ఓటమితో డీలా పడ్డ క్యాడర్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారంతో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తారు. ఇప్పటికే కరీంనగర్ లో భారీ బహిరంగ సభను పార్టీ నిర్వహించింది. అక్కడి నుండే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ పై కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. మరో వైపు కేటిఆర్, హరీష్ రావు మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రా ల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా కేటీఆర్, హరీష్ రావుకు గులాబీ బాస్ కేసీఆర్ బాధ్యతలు అ ప్పగించనున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారంతో క్యాడర్ లో భరోసా వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్దమవుతు న్నారు. అధికారం కోల్పోవడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాలేదు .దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి అభ్యర్థులతో మాట్లాడి వారిని పోటీకి ఒప్పించారు. కొంతమంది అభ్యర్థులకు పార్టీ తరపున ఆర్ధిక సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ప్రచార వ్యూహం అమలు ఎలా ఉంటుందో చూడాలి.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్