Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

తమిళిసై జమానా …. వివాదాల పర్వం

      తమిళిసై ఒక వివాదాస్పద గవర్నర్. రాజ్‌భవన్‌ను సమాంతర అధికార కేంద్రంగా తయారు చేయడానికి తమిళిసై ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రజాదర్బార్ వివాదం తెలంగాణ సమాజంలో దుమారం రేపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, గవర్నర్ ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించడమేంటన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా తమిళిసై తిరస్కరించారు. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు కూడా గవర్నర్ హోదాలో తమిళిసై మోకాలడ్డారు.

       తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ఒకటి కాదు…రెండు కాదు అనేక వివాదాలను మూటగట్టుకున్నారు. ఒకవైపు ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంటే మరో వైపు జనం సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ పేరుతో నానా హంగామా చేశారు తమిళిసై . ప్రజల కష్టాలు తెలుసుకోవడం వాటికి పరిష్కారమార్గాలు కనుగొనడం ప్రభుత్వాల పని. ఈ ప్రక్రియలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజా ప్రభుత్వానికి సమాంతరంగా రాజ్‌భవన్‌ను తెరమీదకు తీసుకురావడమే ప్రజా దర్బార్ లక్ష్యం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజాదర్బార్ వివాదం తెలంగాణ సమాజంలో దుమారం రేపింది. ఒక్క బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ తమిళిసై తీరుపై మండిపడ్డాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, గవర్నర్ ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించడమేంటన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది.

       గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా గవర్నర్ హోదాలో తమిళిసై తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3),171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవా రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత అటు శ్రవణ్‌ ఇటు సత్యనారా యణకు లేవన్నది అప్పట్లో తమిళిసై చేసిన వాదన. అందువల్లనే ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తు న్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తమిళిసై స్పష్టం చేశారు. గవర్నర్ కోటా కింద కేసీఆర్ సర్కార్ సిఫార్సు చేసిన పేర్లను తమిళిసై తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు కూడా తమిళిసై మోకాల డ్డారు. ఇలాంటి విషయాల్లో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్న మాటను ఎవరూ కాదనలేరు. అయితే గవర్నర్ విచక్షణాధికారాలు కూడా రాజ్యాంగంలోని ఫెడరల్ స్పూర్తికి లోబడే ఉంటాయి. విచ క్షణాధికారా లను అడ్డం పెట్టుకుని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఎడమచేతితో తోసిపు చ్చడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇక్కడో విషయం గమనించాలి. గవర్నర్ల నియామకాలకు సంబం ధించి సర్కారియా కమిషన్ గతంలో అనేక సూచనలు చేసింది.

ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్నవారిని గవర్నర్లుగా నియమించరాదంటూ సర్కారియా కమిషన్ ఖరాఖండీగా పేర్కొంది. అయితే సర్కారియా కమిషన్ సిఫార్సులను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలోకి పడేసింది. అందుకు ఉదాహరణ సాక్షాత్తూ గవర్నర్‌గా తమిళిసై నియామ కమే. తమిళిసై పూర్వాశ్రమంలో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో కీలక పదవిలో పనిచేయడమే. రాజకీయరంగం నేపథ్యం నుంచి గవర్నర్‌గా నియమితులైన తమిళిసై అదే రాజకీయ రంగాన్ని సాకుగా చూపించి ఇద్దరు బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారా యణ పేర్లను తిరస్కరించడమే విచిత్రాలలోకెల్లా విచిత్రం. అలాగే 2022 జులై నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలను వరదలు ముంచెత్తినప్పుడు వరద ప్రాంతాల్లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ పర్యటించారు. అయితే ముఖ్యమంత్రికి పోటీగా గవర్నర్ హోదాలో తమిళిసై కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు. కథ అంతటితో ఆగలేదు. వరద నష్టంపై తమిళిసై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. వాస్తవానికి బ్రిటిష్ పాలననాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే, గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. మౌలికంగా మనది సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజమే స్ఫూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ ఆశించారు. అయితే, సమాఖ్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తు న్నాయి .దీని ఫలితంగానే, గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. రాజ్యాంగ ప్రతి నిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్, కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నా రన్న ఆరోపణ లొస్తు న్నాయి. అంతిమంగా గవర్నర్ల వ్యవస్థే వివాదాస్పదంగా మారుతోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్