UPI Payments |ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే యాప్స్ ద్వారా యూపీఐ(UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందనే వార్తలపై ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. సాధారణ వినియోగదారలు రోజు జరిపే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. కేవలం ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. రూ.2,000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ(Interchange Charge)వసూలు చేయాలని సూచించింది. అంటే ఇంటర్ చేంజ్ ఛార్జీలు PPI వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని NPCI వెల్లడించింది.
Read Also: ఏప్రిల్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి: సుప్రీం
Follow us on: Youtube, Instagram, Google News