Warangal Accedent | వరంగల్ లో దారుణం జరిగింది. పట్టణంలోని బస్టాండ్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి చెందారు. స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి వచ్చిన చింతా అనిల్ ను ఆర్టీసీ డ్రైవర్ బస్సును వేగంగా నడిపి ఢీ కొట్టాడు. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు.. నాలుగు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. నానా బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.