B.Tech Student Suicide | కృష్ణా జిల్లా గుడివాడలో బీటెక్ విద్యార్థిని నవ్య ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ శ్రీరామపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవ్య..ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. కాలేజీ ఫీజు చెల్లించకపోవటం వల్లే నవ్య మనస్థాపం చెంది మృతి చెందిందని స్థానిక సమాచారం. అయితే ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.