హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్‌లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మీని గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసం హత్య చేశారు. హత్యకు గురైన విజయలక్ష్మీ కర్ణాటకకు చెందిన మహిళగా గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.