రైతులకు వచ్చిన కరువు కాలంతో వచ్చింది కాదని.. కాంగ్రెస్ తెచ్చిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్న ఆయన.. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శలు గుప్పించారు. సాగు నీరు ఇవ్వకుండా, రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. తక్షణమే ఎండిన పంటలకు ఎకరానికి 25 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని,.. .ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


