స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. తెలంగాణలో ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్నందున పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమలుపరిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధానాలపై మీటింగ్ లో చర్చించనున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం మొదటి సమావేశం కావడం గమనార్హం.
కన్నడ నాట కాంగ్రెస్ గెలుపు, బీజేపీ ఓటమి.. తెలంగాణ ఎన్నికల్లో ఏవిధమైన ఫలితాన్ని చూపబోతాయన్న దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ ఎత్తులను ఏవిధంగా తిప్పికొట్టాలి.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ను ఏవిధంగా తీసుకొళ్ళాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతమ జిల్లా, నియోజకవర్గాల్లో ఎలా పర్యటించాలని అన్న దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


