బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ గులాబీ ప్రజాప్రతినిధులు రోజుకో వినూత్న రీతిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతున్నారు. ఇవాళ రైతు కండువాలతో అసెంబ్లీ, మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్ ధరించి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మొన్న బేడీలు ధరించి నిరసన తెలియజేశారు.