నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాలున్నా.. కేటీఆర్, హరీష్‌రావులు ప్రజల్లో విష ప్రచారాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ విషప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విద్యా విధ్వంసం తెలంగాణలో జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విష ప్రచారం మానుకోవాలని కడియం హెచ్చరించారు.