Medchal |కట్నం సరిపోలేదని వరుడు పెళ్లి ఆపేసిన ఘటనలు చాలా చూశాం. కానీ ఓ పెళ్లి మాత్రం ఊహించని ఘటనతో ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని వధువు పెళ్లికి నో చెప్పేసింది. ఈ వింత ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురుకట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది.
ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అమ్మాయి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కానీ వారు ససేమిరా అనడంతో పెళ్లి ఆగిపోయింది. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.
Read Also: ఇలాంటి సీఎంని నేనెక్కడ చూడలేదు: కన్నా లక్ష్మీ నారాయణ
Follow us on: Youtube Instagram