స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అనేక సార్లు విచారణకు పిలిచి ప్రశ్నించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపడం చర్చనీయాంగా మారింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించించిన సంగతి తెలిసిందే.