ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం బేలా త్రివేది కొట్టివేసింది. ఛార్జ్‌షీట్ దాఖలైనందున జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది.
ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ జస్టిస్ త్రివేది ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.