విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. అనంతరం బొత్స పేరును ప్రకటిచారు. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తంగా 841 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు ఉండగా.. 11 ప్రజాప్రతినిధుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు 13వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.