- ఈ ఏడాది జరిగే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్
- ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు
ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. వచ్చే లోక్ సభ సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలకు అజెండా ఫిక్స్ చేయడానికి వీలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఖరారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు, అనేక మంది కీలక నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నగరవీధుల్లో రోడ్ షో నిర్వహించారు.