ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్ ను రద్దు చేస్తూ కలకత్తా హై కోర్టు తీర్పును బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్వాగతిం చారు. కలకత్తా హై కోర్టు తీర్పు మమత బెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంప పెట్టు వంటిదని అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని కోల్‌కతా న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తు న్నారని ఆరోపించారు. మమత బెనర్జీ తీరు న్యాయస్థా నాలను అవమానపరిచే విధంగా ఉందని ఫైర్ అయ్యారు. కోర్టు తీర్పును రాజకీయాలకు ముడిపెట్టడం దిగాజారుగుతనమంటూ విమర్శించారు. బెంగాల్ విధానమే ఏపీ, తెలంగాణ లో ఉందని చెప్పారు. కోర్ట్ తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని లక్ష్మణ్ చెప్పారు.