వికారాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తుంటే.. ప్రతిపక్షాలు కావాలనే ఎమ్మెల్యేను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ విమర్శలపై బీజేపీ పరిగి ఇంచార్జ్ పరమేశ్వర రెడ్డి స్పందిస్తూ దళితుల భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూకబ్జాల వ్యవహారంలో ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారని.. గతంలో ఆయన కుటుంబసభ్యులు కూడా కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
దళితుల భూముల కబ్జాకు పాల్పడుతున్న అజీమ్.. ఎమ్మెల్యే బినామీ అని నియోజకవర్గం మొత్తం తెలుసన్నారు. మహేశ్వర్ రెడ్డి ఓ వర్గానికి సపోర్ట్ చేస్తూ దళితులను అణిచివేస్తున్నారని.. గులాబీ నేతల ఆగడాలను అడ్డుకుంటామని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాద్యక్షుడు కిరణ్ కుమార్ హెచ్చరించారు. భూ వివాదం కోర్టులో ఉండగా ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్య అని.. కోర్టులంటే వారికి లెక్క లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.