22.7 C
Hyderabad
Monday, October 27, 2025
spot_img

మధ్యప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ ?

    ప్రతి ఎన్నికలోనూ మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొండంత అండగా నిలుస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్, ఇటు మధ్యప్రదేశ్ లో మెజారిటీ సీట్లు సాధిస్తే.. కేంద్రంలో అధికారం దక్కినట్లే అన్నభావన ఉంది. 2014లో నరేంద్రమోదీ ప్రభంజనం మొదలు కాక ముందు నుంచీ మధ్యప్రదేశ్ లో బీజేపీదే ఆధిపత్యం. గత ఎన్నికల్లో 29 స్థానాల్లో 28 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధపడుతోంది. గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం కావడంతో ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైరెక్ట్ ఫైట్ తథ్యం.

జాతీయ రాజకీయాల్లో మధ్యప్రదేశ్ చాలా ప్రాధాన్యం ఉంది. మధ్యప్రదేశ్ లో అత్యంత సుదీర్ఘ కాలం పాటు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు సృష్టించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 16.5 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 16 ఏళ్ల పాలన తర్వాత 2023లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కీలక పాత్ర వహించారు. 2023 ఎన్నికల తర్వాత చౌహాన్ స్థానంలో కాషాయ దళానికి చెందిన డాక్టర్ మోహన్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.

మధ్యప్రదేశ్ లోని 29 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నాలుగు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో జరుగుతాయి. 2009లో మొత్తం 29 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ 16, కాంగ్రెస్ 12, బహుజన్ సమాజ్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించాయి. 2014 లో నరేంద్రమోదీ ప్రభంజనంలో బీజేపీ 27 , కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందింది. 2019లో మెత్తం 28 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా కాంగ్రెస్ ఒకే స్థానంలో గెలిచింది. అదీ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కొడుకు నుకుల్ నాథ్ నెగ్గాడు. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఉంది. మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ 19న ఆరు స్థానాలకు, ఏప్రిల్ 26న ఏడు స్థానాలకు, మే 7న 8 నియోజకవర్గాలకు, మే 13న మరో 8 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో 163 సీట్లు గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ 68 స్థానాలకు పరిమిత మైంది.

మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ హవా కొనసాగుతోంది. దాదాపు 25 ఏళ్లుగా బీజేపీదే పైచేయిగా ఉంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప అధికారంలోకి వచ్చినా, జాతీయ స్థాయిలో మోదీ పార్టీకి ఎదురులేదు. 2014, 2019 లో బీజేపీ ఘనవిజయాలు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభ, రామమందిర్ అంశం తోపాటు, గత పదేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సాధించిన విజయాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలు. 16 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.కేంద్రమంత్రి జ్యోతి రాదిత్య సింధియా, పగన్ సింగ్ కులస్థే వంటి హేమా హేమీలు రంగంలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు గట్టి పట్టే ఉంది. బీజేపీ హవా నడుస్తున్న కాలంలో కూడా 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ చీలిపోవడంతో తిరిగి బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఒక సీటుకే పరిమితమైంది. ఈ సారి కనీసం పట్టుమని పది సీట్లైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఆరు గ్యారంటీల నినాదంతో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తోంది. 29 సీట్లలో ఈ సారి కాంగ్రెస్ 28 స్థానాలకు పోటీచేస్తోంది. మరో స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీకి కేటాయించింది. కులగణన , రిజర్వేషన్ల పెంపు, వంటి అంశాలను ప్రచారాస్త్రంగా చేసుకుంది సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ కు ఏమేరకు విజయం తెచ్చి పడతారో చూడాలి.

రాజకీయాలే కాదు.. మధ్యప్రదేశ్ లో సమస్యలకు కొరతలేదు. నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల ప్రధానమైనవి. సైన్యంలో చేరేందుకు యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. అగ్నివీర్ వంటి తాత్కాలిక నియామకాల పట్ల యువత విముఖతతో ఉన్నారు. ఇది తమకు కలసివచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. భారతీయ జనతాపార్టీ మాత్రం.. ప్రచారంలో అప్రతిహతంగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో రావడం తో పాటు మోదీ ప్రకటించిన 400 సీట్లు సాధించాలంటే.. మధ్యప్రదేశ్ లో క్లీన్ స్వీప్ చేయాలని, మొత్తం 29 స్థానాలు గెలుచుకోవాలని మోదీ అండ్ కో ప్రణాళికలు రచిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతా రో చూద్దాం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్