స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని మాంసం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఎండాకాలం కావడంతో భారీగా చికెన్ ధరలు పెరిగి పోయాయని నిర్వాహకులు అంటున్నారు. ఎండ వేడిమి కారణంగా కోళ్లు చనిపోయాయని.. ఆ ప్రభావంతో చికెన్ ధర రూ. 300 వరకు పెరిగినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గాయని వాపోతున్నారు షాప్ నిర్వాహకులు. ఇంతకముందు ఏప్రిల్ చివర లో రూ. 220 ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు రూ. 300 వరకు పెరిగింది.