కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యల చేశారు. తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్‌ది అని అన్నారు. తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు కేటీఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు మహా డ్రామా రావు అని ప్రజలకు తెలుసు.. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో తామే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంత లాగా మీ నాయన నువ్వు వ్యవహారించారని ఆరోపించారు. కేటీఆర్ ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచి పెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు. ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్‌కి తానే తీసుకొచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.