37.2 C
Hyderabad
Thursday, April 16, 2026
spot_img

భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్‍ ఫామ్ అందజేసిన జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపు డిక్లరేషన్‍కు తెరపడింది. ఎట్టకేళకు ఆయన డిక్లరేషన్ ఫామ్ అనుకున్నారు, రాంగోపాల్ రెడ్డికి జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఫామ్ అందజేశారు.

అంతక ముందు డిక్లరేషన్ ఫారం ఇంకా ఇవ్వనందుకు జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు రాంగోపాల్ రెడ్డి ధర్నాకు దిగారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, ప్రభాకర్ చౌదరితో పాటు పలువురు నిరసన తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.

పరిస్థితి మరికాస్త ఉద్రిక్తం కావడంతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాహనాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకువెళ్లారు. జేఎన్టీయూ కాలేజ్ దగ్గర ఉద్రిక్తంగా మారడంతో ముందుగానే ప్రత్యేక భద్రతా బలగాలను కూడా రప్పించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు అనేక అల్లర్ల అనంతరం రాంగోపాల్ రెడ్డి.. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్