గాంధీ భవన్‌లో గందరగోళం నెలకొంది. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ స్టేట్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. సమావేశంలో భద్రాద్రి జిల్లా సెక్రటరీగా పోటీ చేసిన సుధీర్‌పై దాడి జరిగింది. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చీకటి కార్తీక్ కి పోటీ చేసే అర్హత లేకపోయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా ఎంపిక చేశారని ఆరోపించడంతో దాడికి దిగారు యూత్ కాంగ్రెస్ శ్రేణులు. యూత్ కాంగ్రెస్‌లో కష్టపడి పని చేసిన వారికి పదవులు రావడం లేదని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు.