స్వతంత్ర వెబ్ డెస్క్: ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ టీమ్‌కు కెప్టెన్‌గా బుమ్రాను నియమించింది. ఈ అనూహ్య నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు. వెన్నునొప్పితో చాలా కాలం క్రితం జట్టుకు దూరమైన బుమ్రా సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకుని తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దానికి ఐర్లాండ్ సిరీస్ వేదికగా కానుంది. ఈ నెల 18 నుంచి 23 వరకు ఐర్లాండ్‌తో టీమిండియా మూడు టీ20లు ఆడనుంది. 18, 22, 23 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
బుమ్రా టీమ్‌లోకి తిరిగొస్తాడని అంతా భావించినా ఇలా కెప్టెన్‌గా వస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే.. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. చాలా కాలంగా ఆటకు దూరమైన ప్లేయర్‌పై ఈ నిర్ణయం ఒత్తిడి పెంచుతుందని, యువ క్రికెటర్లతో కూడిన జట్టును నడిపించడం అంత సులువైన పనికాదని, కాస్త అటూ ఇటూ అయితే ఐర్లాండ్ చేతిలో ఓటమి టీమిండియాకు ఘోర అపఖ్యాతిని మూటగడుతుందని కొంతమంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న బుమ్రాకు కాస్త ఫ్రీ గేమ్ టైమ్ ఇస్తే బాగుండేదని అంటున్నారు. అలా కాకుండా కెప్టెన్సీ భారం పెట్టడం సరైంది కాదని పేర్కొన్నారు.
ఇక బుమ్రా కెప్టెన్ కాగా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టీమ్‌లో వీరిద్దరితో పాటు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేష్ కుమార్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ ఉన్నారు. మరి ఈ టీమ్‌కు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.