స్వతంత్ర వెబ్ డెస్క్: సినిమా అంటే మెయిన్ ఫేస్ హీరోదే కనిపిస్తుంది. కథానాయకుడి పేరు, క్రేజ్ మీదే మూవీ బిజినెస్ జరుగుతుంది. ఆయన్ను చూసే ఆడియెన్స్ థియేటర్లకు వస్తారు. కానీ మూవీ మేకింగ్‌లో ఎంతో మంది పనిచేస్తారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ దగ్గర నుంచి ఎంతో మంది టెక్నీషియన్ల కష్టం ఇందులో ఉంటుంది. ఒక సినిమా పట్టాలెక్కడానికి హీరో ఓకే చెబితే చాలు. కానీ ప్రొడ్యూసర్ లేకపోతే ప్రాజెక్టు కార్యరూపమే దాల్చదు. సినిమాలపై ఉన్న అభిమానంతో మంచి అభిరుచితో చిత్రాలు తీసి డబ్బులతో పాటు పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు. ఇష్టంతో సినిమాలు తీసే నిర్మాతలు క్రమంగా కనుమరుగవుతున్న దశలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు. ‘దిల్’ దగ్గర నుంచి ‘బలగం’ వరకు ఆయన ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో తాను ప్రెసిడెంట్ గెలుపొందిన విషయం తెలిసిందే.
తాజాగా నిర్వహించిన ఒక ప్రెస్మీట్లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్‌కు తాను ప్రెసిడెంట్‌గా ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందని అనుకుంటే దానికే ప్రయారిటీ ఇస్తానన్నారు. ఛాంబర్ బాధ్యతలపై మరింత బలంగా ఫోకస్ చేస్తానని.. ఎక్కువ టైమ్ కేటాయిస్తానన్నారు దిల్ రాజు. ఈ సందర్భంగా రిపోర్టర్లు దిల్ రాజును ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ అది జరుగుతుంది. తర్వాత ఏం అవుతుందనేది ఇప్పుడే ఎలా చెబుతాం? కానీ పాలిటిక్స్‌లోకి వెళ్తే ఏ పార్టీ అయినా సరే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో సీటు ఇవ్వొచ్చు. నేను గెలవొచ్చు కూడా. కానీ రాజకీయాలు, ఇండస్ట్రీ వేర్వేరు. రాజకీయాలా? ప్రొడ్యూసర్ కౌన్సిలా? అంటే నాకు ఇదే ఇంపార్టెంట్’ అని దిల్ రాజు స్పష్టం చేశారు.